బెంగళూరును చిత్తుగా ఓడించిన చెన్నై

బెంగళూరును చిత్తుగా ఓడించిన చెన్నై
  • 69 పరుగుల తేడాతో కోహ్లి సేనకు తొలి ఓటమి
  • బంతితో ఇరగదీసి.. బ్యాట్‌తో ఉతికి ఆరేసిన జడేజా
  • చివరి ఓవర్లో చెలరేగిపోయిన జడ్డూ (5 సిక్సులు ఒక బౌండరీతో 37 పరుగులు)
  • చెన్నై స్కోర్:  20 ఓవర్లలో 191/4
  • బ్యాటింగ్ లో 62 పరుగులు... బౌలింగ్ లో 4 ఓవర్లలో 3వికెట్లు తీసి జడేజా ఆల్ రౌండ్ ష
  • బెంగళూరుకు 192 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించిన చెన్నై 
  • టార్గెట్ ఛేదనలో శుభారంభం చేసినా తర్వాత చేతులెత్తేసిన బెంగళూరు
  • ఓపెనర్ గా వచ్చి కేవలం 5 పరుగులకే వెనుదిరిగిన కోహ్లి
  • కోహ్లి తర్వాత పెవిలియన్ కు క్యూ కట్టిన బ్యాట్స్ మెన్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి చేతులెత్తేసిన కోహ్లి సేన
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై

ముంబై: ఐపీఎల్-14 సీజన్ లో వరుసగా 4 విజయాలతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లి సేనకు ఆదివారం ఐదో మ్యాచ్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఘన విజయంతో సత్తా చూపాలని తహతహలాడుతున్న ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఛాంపియన్ లా ఆడి కోహ్లి సేనను 62 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించి బెంగళూరు వరుస విజయాల ఊపుకు బ్రేక్ వేసింది. అంతేకాదు కోహ్లి సేనను కిందకు తోసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది చెన్నై. 

తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ధోనీ సేన శుభారంభం చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (33 పరుగులు 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), డుప్లెసిస్ (50 పరుగులు, 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సు)తో ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశారు. ఆపై రన్ రేట్ పెంచే ప్రయత్నంలో సురేష్ రైనా ధాటిగా ఆడినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 18 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సులతో మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. హర్షల్ పటేల్ చెన్నై కుదురుకోకుండా మూడు వికెట్లు తీయగా హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పొదుపుగా పరుగులిచ్చాడు. దీంతో చివరి రెండు ఓవర్లను సిరాజ్, హర్షల్ పటేల్ లకు అవకాశం కల్పించాడు కోహ్లి. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రవీంద్ర జడేజాను కట్టడి చేసేందుకు సిరాజ్ ప్రయత్నించినా.. ఒక బౌండరీ సాధించి కోహ్లి సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యాడు. చివరి మూడు ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీకి ఆడే అవకాశమే లేకపోవడంతో చివరి ఓవర్లో ధోనీ రెచ్చిపోవడం ఖాయమని అభిమానులంతా ఆశిస్తున్న సమయంలో జడేజా అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. చెలరేగిపోయాడు. తొలి విడత కట్టడిగా బౌలింగ్ చేసి 3వికెట్లతో సత్తా చేసిన హర్షల్ పటేల్ కు చివరి ఓవర్లో పీడకలగా మార్చాడు జడేజా. వేసిన బంతిని వేసినట్లే ఉతికి ఆరేశాడు. దీంతో హర్షల్ పటేల్ సంయమనం కోల్పోయి ఒక బంతి నోబాల్ వేయడంతోపాటు..  షార్ట్ పిచ్ బంతితో జడేజాకు ఫ్రీ హిట్ ఛాన్సిచ్చుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆకాశమే హద్దు అన్నట్లు జడేజా చివరి ఓవర్లో బంతి బంతిని సిక్సు లేదా ఫోర్లతో మొత్తం 37 పరుగులు పిండుకున్నాడు.
బెంగళూరుకు భారీ శుభారంభం కల్పించిన పడిక్కల్ 
192 పరుగుల భారీ టార్గెట్ తో లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరుకు పడిక్కల్ శుభారంభం అందించాడు. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ కోహ్లి సింగిల్ డిజిట్ పరుగులకే సురేష్ రైనాకు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉన్న కోహ్లి తక్కువ స్కోర్ కే వెనుదిరగడం తో బెంగళూరుకు షాక్ తగిలింది. అయినా అలాంటి ఛాయలేవీ కనిపించకుండా పడిక్కల్ బౌలర్లను చితక్కొట్టి బెంగళూరుకు శుభారంభం ఇచ్చాడు. పడిక్కల్ ఆడుతున్నంత సేపు కోహ్లి సేనకు గెలిచే ఛాన్స్ ఉన్నట్లే కనిపించింది. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ ఔటయ్యాక మ్యాక్స్ వెల్ మినహా మిగిలిన వారంతా వచ్చినట్లే టార్గెట్ ఛేజ్ దిశలో ఆడలేకపోయారు. మ్యాక్స్ వెల్ (22 పరుగులు, 15 బంతుల్లో 3 ఫోర్లు) సెకండ్ టాప్ స్కోరర్ గా మారాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టగా చివరలో చాహల్ 8, సిరాజ్ 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.